Chandrababu: టీడీపీలో చేరిన ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు ప్రొఫెసర్ జ్యోత్స్న

  • చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిక
  • కండువా కప్పి  ఆహ్వానించిన చంద్రబాబు
  • కష్టపడి పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్ష
వలసలతో విలవిల్లాడుతున్న తెలంగాణ టీడీపీకి ఇది శుభవార్తే. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరే ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్న వేళ.. ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు ప్రొఫెసర్ జ్యోత్స్న టీడీపీలో చేరారు. హైదరాబాదులో ఆదివారం తన సహచరులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. జ్యోత్స్నకు కండువా కప్పిన చంద్రబాబు ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

Chandrababu
professor jyotsna
Telugudesam

More Telugu News