shamshabad: దిశ కేసులో కీలకం కానున్న లారీ యజమాని సాక్ష్యం.. నిందితుల కస్టడీకి నేడు పిటిషన్

  • ఘటన జరిగిన రోజు తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద లారీ
  • నిందితుల కదలికలపై సీసీ టీవీ ఫుటేజీ సేకరణ
  • పకడ్బందీగా సాక్ష్యాధారాల సేకరణ

శంషాబాద్‌లో అత్యాచారం, హత్యకు గురైన దిశ కేసులో లారీ యజమాని వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఘటన జరిగిన రోజున నిందితులు తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో లారీని నిలిపి ఉంచారు. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్న నిందితులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారు.

ఈ కేసులో నిందితులు తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. తొండుపల్లి వద్ద లారీని నిలిపి ఉంచినట్టు ఆధారాలు సేకరించిన పోలీసులు, నిందితుల కదలికపై సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. ఘటన జరిగిన రోజున నిందితులు అక్కడే ఉన్నట్టు లారీ యజమాని ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో  అత్యంత కీలకం కానుందని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు, ప్రాథమిక దర్యాప్తులోనే నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు.. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ కోరనున్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

  • Loading...

More Telugu News