Disha: దిశ హత్యాచార నిందితుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. నేరం రుజువైతే మరణశిక్ష!

  • దిశ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు
  • నిందితులు తప్పించుకోకుండా ఆధారాలు, సాక్ష్యాలు సేకరిస్తున్న పోలీసులు
  • త్వరలో చార్జ్‌షీట్

దిశ హత్యాచార నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసును త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో వీలైనంత త్వరలో నిందితులపై చార్జ్‌షీట్ రూపొందించాలని పోలీసులు భావిస్తున్నారు. భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారు తప్పించుకోవడానికి వీల్లేకుండా సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన వెంటనే చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.

వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన హత్యాచార కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. నిందితుడు ప్రవీణ్‌కు 56 రోజుల్లోనే మరణశిక్ష విధించింది. ఈ కేసు స్ఫూర్తితో వీలైనంత త్వరగా దిశ కేసు నిందితులకు శిక్ష పడేలా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. కోర్టులో నేరం కనుక రుజువైతే దిశ హత్యాచార కేసు నిందితులకు మరణశిక్ష పడడం ఖాయం.

More Telugu News