దైవాశీస్సులు లేనిదే న్యాయాధికారుల బాధ్యతల్లో వుండటం సాధ్యం కాదు: జస్టిస్ మహేశ్వరి
- గుంటూరులో న్యాయాధికారుల సదస్సు ప్రారంభం
- పెండింగ్ కేసులు, జ్యుడిషియల్ అకౌంటుబిలిటీ పై చర్చ
- న్యాయమూర్తుల తీర్పులతో ప్రజల జీవితాలు ముడిపడి వుంటాయి
‘ఒక వ్యక్తి రాత, అదృష్టాన్ని మీరు నిర్ణయిస్తారు. ఇంకెవరికీ ఇలాంటి అధికారం లేదు. అయితే, ఆ అధికారాన్ని సద్వినియోగం చేసినప్పుడే న్యాయం వర్థిల్లుతుంది’ అని అన్నారు. న్యాయమూర్తుల తీర్పులతో ప్రజల జీవితాలు ముడిపడి వుంటాయని, బాధిత ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం వుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.62 లక్షల కేసులు పెండింగ్ లో వున్నాయని, ఈ కేసులను సత్వరమే పరిష్కంచాలని ఆదేశించారు. వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో హైకోర్టు సహా అన్ని జిల్లాల న్యాయమూర్తులు పాల్గొన్నారు.