USA: విమానాన్ని కబళించిన మంచు తుపాను...9 మంది మృతి

  • అమెరికాలో ప్రమాదం
  • కుప్పకూలిన చిన్నవిమానం
  • సౌత్ డకోటాలో కొన్నిరోజులుగా మంచు తుపానులు

ప్రతికూల వాతావరణం కారణంగా ఓ చిన్న విమానం కూలిపోయిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 12 మంది ఉన్నారు. అమెరికాలోని సౌత్ డకోటా చాంబర్లీన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. చాంబర్లీన్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ పిలాటస్ పీసీ-12 చిన్న విమానం కొద్దిసేపటికే మంచు తుపానులో చిక్కుకుంది. దక్షిణ డకోటా ప్రాంతంలో కొన్ని రోజులుగా మంచు తుపాను పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గాల్లోకి లేచిన విమానం సౌత్ డకోటా ప్రాంతం గగనతలంలో ప్రవేశించిన కొద్దిసేపటికే రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తప్ప మిగతావారందరూ దుర్మరణం పాలయ్యారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News