kcr: ఆడపిల్ల పెళ్లంటే ఎంత కష్టమో సీఎం కేసీఆర్ కు తెలుసు: మంత్రి హరీశ్ రావు

  • అందుకే, కల్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చారు
  • నాగర్ కర్నూల్ లో సామూహిక వివాహాలు
  • ఒకే ముహూర్తంలో ఒక్కటైన 165 జంటలు 
ఆడపిల్ల పెళ్లంటే ఎంత కష్టమో సీఎం కేసీఆర్ కు తెలుసని, అందుకే, కల్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చారని మంత్రి హరీశ్ రావు అన్నారు. నాగర్ కర్నూల్ లోని జెడ్పీ మైదానంలో ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. ఒకే ముహూర్తంలో 165 జంటలు ఒక్కటయ్యాయి. 2012 నుంచి సామూహిక వివాహాల మహోత్సవాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నిర్వహించిన ఈ  కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, మంచి పనికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయని అన్నారు. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం అని అన్నారు. వధూవరుల బంధువులు, మిత్రులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. నూతన జంటలకు కానుకలను మర్రి జనార్దన్ రెడ్డి అందజేశారు.
kcr
Harish Rao
Marri
Janardhan reddy

More Telugu News