Telangana: రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా మారాయి.. శంషాబాద్ ఘటనపై సీఎం స్పందించకపోవడం విచారకరం: లక్ష్మణ్

  • తెలంగాణలో పాఠశాలలు మూతపడుతున్నాయి
  • వైన్ షాపులు, బారులు మాత్రం తెరుచుకుంటున్నాయి
  • శాంతిభద్రతల పరిస్థితులు అధ్వానంగా మారాయి 
శంషాబాద్ కు చెందిన వెటర్నరీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ స్పందించకపోవడం విచారకరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో పాఠశాలలు మూతపడుతున్నాయని, వైన్ షాపులు, బారులు మాత్రం తెరుచుకుంటున్నాయని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు అధ్వానంగా మారాయని చెప్పారు. కాగా, విద్యార్థులు తక్కువగా ఉన్న ప్రభుత్వ  పాఠశాలలను మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే.
Telangana
laxman
BJP

More Telugu News