Ala Vaikunthapuramulo: కొత్త గుసగుస... నాటి 'ఇంటిగుట్టు' సినిమాకు నేటి రూపమే 'అల వైకుంఠపురములో'!

  • చివరి దశ షూటింగ్ లో చిత్రం
  • ఇప్పటికే సూపర్ హిట్ అయిన పాటలు
  • ఎన్టీఆర్ చిత్రంతో పోలికలున్నాయంటున్న టాలీవుడ్
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'అల వైకుంఠపురములో' షూటింగ్ తుది దశకు చేరుకోగా, ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా, టాలీవుడ్ లో ఈ సినిమాపై కొత్త గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ నటించిన అలనాటి సూపర్ హిట్ సినిమా 'ఇంటిగుట్టు'కు, 'అల వైకుంఠపురములో' సినిమాకు దగ్గరి పోలికలు ఉన్నాయని సమాచారం. అదే కథను, నేటి తరానికి దగ్గరగా మలచిన త్రివిక్రమ్, తనదైన శైలిలో తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక దీనిలో నిజమెంత అన్నది సినిమా విడుదలైతే గాని తెలియదు.
Ala Vaikunthapuramulo
Intiguttu
Allu Arjun
Trivikram

More Telugu News