Subbarao: ఏక్ దిన్ కా డీఐజీ... రిటైర్ మెంట్ రోజున సుబ్బారావును డీఐజీగా నియమించిన తెలంగాణ సర్కారు!

  • రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ హైదరాబాద్ డీఐజీగా నియామకం
  • పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం
  • చానాళ్లుగా ఖాళీగా ఉన్న పోస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీ సుబ్బారావును రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ హైదరాబాద్ డీఐజీగా నియమించింది. సుబ్బారావు పదవీకాలం ముగిసేనాడే ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగానికి డీఐజీ పోస్టు చానాళ్లుగా ఖాళీగా ఉంది. సుబ్బారావు శనివారం నాడు పదవీ విరమణ చేయగా, అదే రోజు ఉదయం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక డీఐజీగా ఆయన పదవీ విరమణ చేసినట్టా? అన్న విషయం రేపు తేలుతుంది.
Subbarao
DIG
Telangana

More Telugu News