doctor: వైద్యురాలి హత్యాచారం కేసు.. జైలులో నిందితులకు నంబర్ల కేటాయింపు

  • భారీ భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తరలింపు
  • వివరాలు నమోదు చేసే క్రమంలో వీడియో 
  • సోషల్ మీడియాలో వైరల్

వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితులైన నలుగురినీ షాద్‌నగర్ పోలీసులు నిన్న భారీ భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు. వారిని జైలుకు తరలించిన తర్వాత నిందితుల వీడియో ఒకటి బయటకు వచ్చి సంచలనమైంది. నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు వారికి ముసుగులు ధరించారు. తాజాగా, వారి నిజ రూపాలు బయటకు రావడంతో అందరూ విస్తుపోతున్నారు. ముఖంలో బాల్యం ఛాయలు పోని వారే ఇంత దారుణానికి ఒడిగట్టారంటే నమ్మలేకపోతున్నారు.

చర్లపల్లి జైలుకు నిందితులను తరలించిన తర్వాత వివరాలు నమోదు చేసే క్రమంలో వీడియో తీసిన తర్వాత అధికారులు వారికి నంబర్లు కేటాయించారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆరిఫ్‌కు ఖైదీ నంబరు 1979 కేటాయించగా, రెండో నిందితుడైన బొల్లి శివకు 1980, మూడో నిందితుడైన చెన్నకేశవులుకు 1981, నాలుగో నిందితుడైన నవీన్‌కుమార్‌కు 1982 నంబర్లు కేటాయించారు.

More Telugu News