Secunderabad: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత తోట రామయ్య దుర్మరణం!

  • సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం
  • సోమవారం నాడు అంత్యక్రియలు
  • సంతాపం తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు
సికింద్రాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత తోట రామయ్య దుర్మరణం పాలయ్యారు. ఆయనకు భార్య వసుంధర, కుమారుడు రాహుల్ బాబు, కుమార్తె నీలిమ ఉన్నారు. శ్రీ భాస్కర్ ఫిలిమ్స్ పతాకాన్ని స్థాపించిన రామయ్య, 'రణధీరుడు', 'మళ్లీ ఇంకోసారి', 'రౌడీ' చిత్రాలను నిర్మించారు.

శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరుగగా, ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామయ్య మరణించారు. రామయ్య అంత్యక్రియలు సోమవారం నాడు బన్సీలాల్ పేట శ్మశాన వాటికలో జరపనున్నామని కుటుంబీకులు తెలిపారు. రామయ్య మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.
Secunderabad
Road Accident
Tota Ramaiah
Tollywood
Producer

More Telugu News