బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న 'లిమోలైనర్' బస్సు బోల్తా!
- నిన్న రాత్రి బెంగళూరులో బయలుదేరిన బస్సు
- అతివేగంతో అదుపుతప్పి బోల్తా
- రాజస్థాన్ కు చెందిన మహిళ మృతి
మరణించిన మహిళ, రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన సుచిత్ర (38)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అనంతపురంలోని తపోవనం కూడలి వద్ద ఈ ప్రమాదం జరుగగా, భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.