Disha: ప్రియాంక నిందితులకు హైసెక్యూరిటీ సింగిల్ బ్యారక్ కేటాయింపు

  • ప్రియాంక నిందితులకు రిమాండ్
  • చర్లపల్లి జైలుకు తరలింపు
  • ఖైదీ నంబర్ల కేటాయింపు
శంషాబాద్ ప్రాంతంలో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను చంపేయాలంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కాగా, నిందితుల కోసం మేజిస్ట్రేట్ పోలీస్ స్టేషన్ కు తరలిరాగా, ఆయన ప్రాథమిక విచారణ ముగించి నలుగురు నిందితులకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని అత్యంత భద్రత నడుమ చర్లపల్లి కారాగారానికి తరలించారు. వారికి ఖైదీ నెంబర్లు కేటాయించారు. ఏ1గా ఉన్న మహ్మద్ ఆరిఫ్ కు 1979, ఏ2 జొల్లు శివకు 1980, ఏ3 చెన్నకేశవులుకు 1981, ఏ4 జొల్లు నవీన్ కు 1982 నంబర్లు కేటాయించారు.  ఆ నలుగురు నిందితులకు జైల్లోని హైసెక్యూరిటీ సింగిల్ బ్యారక్ కేటాయించారు.
Disha
Telangana
Hyderabad
Charlapalli

More Telugu News