Maharashtra: 'మహా' బలనిరూపణలో ఉద్ధవ్ సర్కారుదే విజయం

  • మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ కూటమి
  • అసెంబ్లీలో బలపరీక్ష
  • ఉద్ధవ్ థాకరే సర్కారుకు అనుకూలంగా 169 ఓట్లు
మహారాష్ట్రలో కొత్తగా కొలువైన శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఇవాళ  బలనిరూపణలో విజయం సాధించింది. ఈ మూడు పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర  అసెంబ్లీలో నేడు బల పరీక్ష నిర్వహించగా, ఉద్ధవ్ థాకరే సర్కారుకు అనుకూలంగా 169 ఓట్లు పడ్డాయి. బల పరీక్ష సమయానికి సభలో ఉన్న ఎవరూ వ్యతిరేకత వ్యక్తం చేయకపోగా, నలుగురు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. కాగా, బలపరీక్షకు ముందే 105 మంది బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Maharashtra
Shivsena
Udhav Thackeray
Congress
NCP
Assembly

More Telugu News