Teju: తేజు హీరోగా గీతా ఆర్ట్స్ లో మరో మూవీ

  • తేజు తాజా చిత్రంగా 'ప్రతిరోజూ పండగే'
  • వచ్చేనెల 20వ తేదీన భారీ విడుదల 
  • గీతా ఆర్ట్స్ లోనే తదుపరి సినిమా
కెరియర్ తొలినాళ్లలో మంచి కథలు పడటంతో, సాయిధరమ్ తేజ్ హిట్లు ఇస్తూ వెళ్లాడు. ఇటు యూత్ కి .. అటు మాస్ ఆడియన్స్ కి ఆయనను చేరువ చేసిన సినిమాల్లో 'పిల్లా నువ్వులేని జీవితం' ఒకటి. అల్లు అరవింద్ ఈ సినిమాతో తేజూను కొంతవరకూ నిలబెట్టగలిగారు. ఈ మధ్య కాలంలోను తేజు వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ పై అల్లు అరవింద్ .. తేజుతో 'ప్రతిరోజూ పండగే' సినిమా చేస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత కూడా తేజూతో అల్లు అరవింద్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అన్నారు. త్వరలోనే ఆ వివరాలను తెలియపరచనున్నారు.
Teju
Allu Aravind

More Telugu News