Disha: షాద్ నగర్ పోలీస్ స్టేషన్ గేటుకు 'బేడీలు' వేసిన పోలీసులు!

  • షాద్ నగర్ పీఎస్ ఎదుట నిరసనకారుల ఆందోళన
  • పీఎస్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం
  • స్టేషన్ గేటును మూసేసిన పోలీసులు
ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో నిరసనకారులు అక్కడకు చేరుకున్నారు. పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గని నిరసనకారులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. స్టేషన్ గేటును మూసేశారు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో... దానికి బేడీలు వేశారు. పీఎస్ గేటుకు బేడీలు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
Disha
Murder
Shadnagar
Police Station

More Telugu News