Hyderabad District: నిందితుల తరఫున న్యాయవాదులెవ్వరూ వాదించొద్దు: ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సినీనటుడు అలీ

  • ఇటువంటి దారుణ ఘటనలు జరగడం బాధాకరం 
  • ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది
  • ప్రియాంక తల్లిదండ్రులకు సాయం అందించాలి 

వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని సినీనటుడు అలీ చెప్పారు. ప్రియాంక రెడ్డికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం అలీ మీడియాతో మాట్లాడారు. ఇటువంటి దారుణ ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్ శివార్లలో ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పారు. నిందితుల తరఫున న్యాయవాదులెవ్వరూ వాదింవవద్దని కోరారు. పిల్లల చదువు కోసమే ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు శంషాబాద్ వచ్చారని తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు సాయం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

  • Loading...

More Telugu News