Hyderabad: 'ప్రియాంక రెడ్డి' ఘటనపై ఆందోళన.. శంషాబాద్ లో భారీగా నిలిచిపోయిన వాహనాలు

  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
  • కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల భారీ ర్యాలీ
  • అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా ర్యాలీ  
వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్ లో ఏ పోకిరీలూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఆ శిక్ష ఉండాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. శంషాబాద్ లో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.

శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా ర్యాలీ కొనసాగుతోంది. దీంతో రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. పర్యవసానంగా శంషాబాద్ లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు.. వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
Hyderabad
Crime News
traffic jam

More Telugu News