Hyderabad: శంషాబాద్‌ సిద్దులగుట్ట 'మహిళ దహనం' కేసు: ఆత్మహత్యే అంటోన్న పోలీసులు

  • దేవాలయం సమీపంలో ఘటన
  • దుండగులు పెట్రోలు పోసి తగలబెట్టారని ప్రచారం
  • ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాలు
వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య మరవకముందే హైదరాబాద్ శివారులోని శంషాబాద్ సిద్దులగుట్ట దేవాలయం సమీపంలో ఇటువంటి మరో ఘటన జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ మహిళను దుండగులు పెట్రోలు పోసి తగలబెట్టారని ప్రచారం జరిగింది. దీనిపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పందించారు.

ఆ మహిళది ఆత్మహత్యగా ప్రాథమికంగా గుర్తించామని ప్రకాశ్ రెడ్డి చెబుతున్నారు. ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఆ సమయంలో ఆమె ఓ ప్రాంతంలో ఆగి స్థానికులతో మాట్లాడిందని, తాను తన కుటుంబ సభ్యుల కోసం వేచి చూస్తున్నానని చెప్పిందని తెలిపారు. సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. కాగా, మహిళపై పెట్రోలు పోసి, దహనం చేయక ముందే ఆమెను దుండగులు హత్య చేసినట్లు నిన్న వార్తలు వచ్చాయి.
Hyderabad
Crime News
Ranga Reddy District

More Telugu News