Fastag: 15 నుంచి ఫాస్టాగ్ అమల్లోకి.. గడువు పెంచిన కేంద్రం

  • టోల్ గేట్ల వద్ద ఎలక్ట్రానిక్ ట్యాక్స్ కలక్షన్ విధానం 
  • సమకూర్చుకోవడంలో వాహన చోదకులు వెనుకబాటు 
  • మరికొంత సమయం ఇవ్వాలని కేంద్రం యోచన

జాతీయ రహదారిపై టోల్ గేట్ వద్ద ఇలా వచ్చి...అలా వెళ్లిపోయేందుకు వీలు కల్పించే ఎలక్ట్రానిక్ ట్యాక్స్ కలక్షన్ విధానం 'ఫాస్టాగ్' అమలు గడువును కేంద్ర ప్రభుత్వం మరో 15 రోజులు పెంచింది. టోల్ ఫీజు చెల్లింపు సందర్భంగా జరుగుతున్న జాప్యాన్ని నివారించి నిమిషం కంటే తక్కువ వ్యవధిలో పనిపూర్తయి వాహనం వెళ్లిపోయేందుకు వీలు కలిగించే విధానం ఇది. 


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విధానం అన్ని టోల్ గేట్ల వద్ద రేపటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం సూచించినంత వేగంగా వాహన చోదకులు ఫాస్టాగ్ ను సమకూర్చుకోవడం సాధ్యం కాకపోవడంతో గడువు పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లోని టోల్ గేట్ల నిర్వాహకులకు సమాచారం అందించింది. దీంతో దేశంలోని అన్ని టోల్ గేట్ల వద్ద 15 రోజుల తర్వాత ఈ విధానం అమల్లోకి రానుంది.

More Telugu News