Nani: 'నిన్నుకోరి' దర్శకుడితోనే మళ్లీ సెట్స్ పైకి నాని

  • నానీకి హిట్ ఇచ్చిన శివ నిర్వాణ 
  • శివపై నమ్మకంతో మళ్లీ ఛాన్స్ ఇచ్చిన నాని
  • విజయ్ దేవరకొండను కూడా లైన్లో పెట్టిన శివ

నాని కథానాయకుడిగా ఆ మధ్య వచ్చిన 'నిన్నుకోరి' ఆయనకి విజయాన్ని తెచ్చిపెట్టింది. దర్శకుడిగా శివ నిర్వాణకి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత చైతూ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన 'మజ్ను' కూడా సక్సెస్ ను సాధించింది. ఈ నేపథ్యంలో మళ్లీ నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాను రేపు లాంచ్ చేయనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఇంతవరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇటు విజయ్ దేవరకొండకి కూడా శివ నిర్వాణ ఒక కథను వినిపించాడు .. ఆ కథ కూడా ఓకే అయింది. అయితే విజయ్ దేవరకొండ వరుస కమిట్మెంట్స్ తో వున్నాడు. అందువలన ముందుగా నానితో చేయడానికి శివ నిర్వాణ సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. ఈ విషయంపై స్పష్టత రావలసి వుంది.

More Telugu News