Jagan: అందుకే మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు: దేవినేని ఉమ

  • వైసీపీ పాలన పక్కదోవ పట్టింది
  • జనాలను పక్కదోవ పట్టించేందుకు మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు
  • జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు
వైసీపీ పాలన పక్కదోవ పట్టిందని... ఆ వైఫల్యాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే వైసీపీ మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జగన్ అభద్రతాభావంలో ఉన్నారని చెెప్పారు. పార్లమెంటులో తమ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడేటప్పుడు కూడా వైసీపీ ఎంపీలు అడ్డు తగులుతున్నారని విమర్శించారు. వైసీపీ పార్లమెంటు సభ్యులు ఎంతగా దిగజారిపోయారో దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు.

జగన్ కు ఇంత అసహనం ఎందుకని దేవినేని ఉమ ప్రశ్నించారు. చంద్రబాబును బూతులు తిడితే మంచి పేరు వస్తుందని వైసీపీ మంత్రులు అనుకుంటున్నారని విమర్శించారు. వీరి మాటలను జనాలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. చివరకు రాళ్లు వేసే విష సంస్కృతికి కూడా తెరలేపారని అన్నారు. చంద్రబాబును తిట్టిస్తూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
Jagan
Devineni Uma
Chandrababu
Telugudesam YSRCP

More Telugu News