RGV: అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నాను: రామ్ గోపాల్ వర్మ

  • కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఏ కులాన్నీ తక్కువ చేయలేదు
  • సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ ఇన్ స్టిట్యూషన్
  • సెటైర్ చేయడం కోసమే ఈ సినిమా తీశాను

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఈ రోజు విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ లభించకపోవడంతో విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో ఏ కులాన్నీ తక్కువ చేయలేదని అన్నారు. అంతా రూల్స్ ప్రకారం చేస్తే, ఏ సినిమా తీయలేం, విడుదలకాదు అని వ్యాఖ్యానించారు. సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ ఇన్ స్టిట్యూషన్ అని చెప్పుకొచ్చారు.

సెటైర్ చేయడం కోసమే ఈ సినిమా తీశానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో ఈ సినిమా తీయలేదని వివరించారు. అందుకే తాను ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నానని వెల్లడించారు. కాగా, రామ్ గోపాల్ వర్మ తరఫు న్యాయవాది ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మారుస్తామని సెన్సార్ బోర్డుకు తెలిపారు.

More Telugu News