BJP: నిరసన తెలియజేయడం విపక్షాల హక్కు... ఏపీ ప్రభుత్వం తీరు సరికాదు : బీజేపీ నేత పురంధేశ్వరి

  • అధికారంలోకి వచ్చి ఆరునెలలైనా రాజధానిలో ప్రగతి లేదు 
  • ఇదేమని ప్రశ్నిస్తే రాళ్లు, చెప్పులు వేయిస్తారా 
  • రాజధానిపై నాన్చివేత ధోరణి సరికాదు

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, తప్పొప్పులను ఎత్తిచూపేందుకు నిరసన తెలియజేయడం విపక్షాల హక్కని బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. అంతమాత్రాన నిరసన తెలిపిన వారిపై రాళ్లు, చెప్పులతో దాడి చేయడం సరికాదన్నారు. నిన్న అమరావతిలో పర్యటించిన చంద్రబాబు బస్సుపై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటన పై ఆమె స్పందించారు. 


కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అర్ధ సంవత్సరం అవుతున్నా రాజధాని విషయంలో ఇసుమంత ప్రగతి లేదన్నారు. అతి ముఖ్యమైన ప్రాంతం అభివృద్ధి విషయంలో నాన్చివేత దోరణి ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ విధానం కూడా సరికాదని తేల్చిచెప్పారు.

More Telugu News