Metrorail: ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. హైటెక్ సిటీ - రాయదుర్గం మెట్రో రైలు ప్రారంభం

  • ప్రారంభించిన మంత్రి కేటీఆర్
  • మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రయాణికులకు అనుమతి 
  • 57.5 కిలోమీటర్లకు పెరిగిన మెట్రో సేవలు

హైదరాబాద్ మహానగరంలోని ఐటీ ఉద్యోగులకు శుభవార్త. కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరమైనా ట్రాఫిక్ జామ్ కారణంగా హైటెక్ సిటీ, రాయదుర్గం మధ్య ప్రయాణించే వారికి ఊరటనిచ్చే వార్త ఇది. ఈ రెండు స్టేషన్ల మధ్య మెట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైలును ఈ రోజు ఉదయం మంత్రి అజయ్ కుమార్ తో కలిసి మరో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

హైటెక్ సిటీ, రాయదుర్గం మధ్య ఒకటే స్టేషన్ ఉన్నప్పటికీ కారిడార్-3లో ఇది చాలా కీలక ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఐటీ సంస్థలన్నీ ఉండడంతో నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు రాకపోకలు జరుపుతుంటారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ వరకు వస్తున్న ఉద్యోగులు అక్కడ దిగి ఆటోలు, ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోంది.

కానీ కేవలం ఐదు నిమిషాల వ్యవధి ప్రయాణానికి అరగంట పడుతుండడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ఈ కిలోమీటరున్నర దూరంలో పడుతున్న ఇబ్బందికి తెరపడినట్టే అని ఉద్యోగులు భావిస్తున్నారు.

More Telugu News