Train: ఐడీ కార్డు ఇవ్వలేదని ఢిల్లీ - రిషీకేశ్ రైలు బోగీకి నిప్పు పెట్టిన యువకుడు!

  • సీట్లు చించివేసి, బోగీకి నిప్పు
  • నిందితుడిని అరెస్ట్  
  • కేసును విచారిస్తున్నామన్న పోలీసులు
తనకు ఐడెంటిటీ కార్డును ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు ఏకంగా రైలు బోగీకే నిప్పుపెట్టాడు. ఢిల్లీ నుంచి రిషీకేశ్ వెళ్లే పాసింజర్ రైల్లో జరిగిన ఈ ఘటన హరిద్వార్ లో తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. "నాకు ఐడీ కార్డు ఇవ్వలేదు. అందువల్లే నేను రైలు కోచ్ కి నిప్పు పెట్టి, సీట్లను చించివేశాను" అని నిందితుడు పోలీసు విచారణలో అంగీకరించాడు. ఇక అతనికి గతంలో ఏదైనా క్రిమినల్ రికార్డు ఉందా? అనే విషయమై లోతుగా విచారిస్తున్నామని హరిద్వారా అడిషనల్ ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు. 
Train
Fire
ID Card
Police

More Telugu News