ED: జగన్ కేసులో ఆస్తులను రిలీజ్ చేయడంపై హైకోర్టుకు ఈడీ.. స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం!

  • మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
  • 2015లో ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
  • తదుపరి విచారణ వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసులో తాము అటాచ్ చేసిన ఆస్తులను ఈడీ అప్పిలేట్ ట్రైబ్యునల్ రిలీజ్ చేయడంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో యథాతథ స్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలంటూ న్యాయస్థానం గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో 2015లో ఈడీ అటాచ్‌ చేసిన పెన్నా సిమెంట్స్‌, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌, పయనీర్‌ హాలిడే రిసార్ట్స్‌ ఆస్తులను ఈడీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇటీవల రిలీజ్ చేసింది. దీనిని వ్యతిరేకించిన ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసిన కోర్టు ప్రతివాదులుగా ఉన్న ఈ మూడు సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
ED
Jagan
Disproportionate assets case
High Court

More Telugu News