Chandrababu: రైతుల త్యాగానికి ఫలితం లేకుండా చేస్తోంది వైసీపీ ప్రభుత్వం: చంద్రబాబునాయుడు

  • అమరావతిని గొప్ప నగరంగా తయారు చేయాలనుకున్నా
  • రాజధాని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే వచ్చా
  • మాపైనే దౌర్జన్యం చేస్తున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితేంటి?
వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. అమరావతిలో చంద్రబాబునాయుడి పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని ఐదారు గొప్ప నగరాల్లో ఒక నగరంగా అమరావతిని తయారు చేయాలని భావించానని అన్నారు. రాజధాని ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం అని, రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలన్నా ఆదాయం కావాలని అన్నారు. అలాంటి ఆదాయాన్ని సమకూర్చే నగరం అమరావతి అని చెప్పారు.

నాడు తాను ఇచ్చిన పిలుపు మేరకు రైతులు తమపై నమ్మకంతో భూములు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతిలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి చెప్పడానికి, రాజధాని నిర్మాణపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే వచ్చానని అన్నారు. రైతులు చేసిన త్యాగానికి ఫలితం లేకుండా చేసే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. వైసీపీ తమ రౌడీలను పంపించి బస్సుపై దాడి చేయిస్తే అద్దాలు పగిలిపోయాయని, ‘మా మీదనే ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నారంటే, ఇక, సామాన్య ప్రజానీకం అంటే ఎంత చులకనో ఆలోచించాల్సిన అవసరం వుంది’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Chandrababu
Telugudesam
YSRCP
Amaravathi

More Telugu News