Comments on Rishabh Parth by VVS Lakshman: పంత్.. అవకాశాలను సద్వినియోగం చేసుకో!: వీవీఎస్ లక్ష్మణ్

  • జట్టులో స్థానం కోసం పోటీ నెలకొంది
  • బ్యాకప్ గా సంజు శాంసంగ్ సిద్ధంగా ఉన్నాడు
  • పంత్ ఇప్పటికీ అద్భుతమైన బ్యాట్స్ మన్

భారత జట్టులో వికెట్ కీపర్ గా కొనసాగుతున్న రిషభ్ పంత్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. జట్టులోకి రావడానికి చాలా మంది ఎదురుచూస్తున్నారని.. కీపర్ స్థానంకోసం సంజు శాంసన్ కాచుకుని ఉన్నాడని హెచ్చరించాడు. వృద్ధిమాన్ సాహా జట్టులోకి రావడంతో టెస్టుల్లో పంత్ స్థానం కోల్పోయాడన్నారు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కూడా అతడు అదే పోటీని ఎదుర్కొంటున్నాడన్నారు. తుది జట్టులో చోటుకోసం అతడిపై ఒత్తిడి నెలకొందని చెప్పారు. పంత్, సంజు శాంసంగ్ వికెట్ కీపర్లుగా విఫలమైతే ధోనీ తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగివచ్చే అవకాశముందన్నాడు.  

 ‘సంజు శాంసన్ రూపంలో బ్యాకప్ ఉన్నాడు. జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ ఇప్పటికే సందేశం పంపింది. పంత్ కు వారు చాలా అవకాశాలిచ్చారు. అతడిప్పటికీ అద్భుతమైన బ్యాట్స్ మన్ అని నా నమ్మకం. గుడ్ లెంగ్త్ బంతులను సైతం సిక్సర్లుగా మార్చడంలో దిట్ట. మ్యాచ్ లను మలుపు తిప్పే సామర్థ్యం అతని సొంతం. ఎందుకనో ఇటీవల బ్యాట్స్ మెన్ గా అతడి ఆలోచనల్లో స్పష్టత లోపించింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు’ అని వీవీఎస్ వ్యాఖ్యానించాడు. 

  • Loading...

More Telugu News