Andhra Pradesh: అమరావతిలో చంద్రబాబు పర్యటన ఫొటోలు ఇవిగో!

  • అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • నిర్మాణాల పరిశీలన
  • అనేక ప్రాంతాల సందర్శన
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటిస్తున్నారు. రాజధానిలో భాగంగా నిర్మాణం జరుపుకుంటున్న అనేక భవనాలను, ప్రాంతాలను ఆయన సందర్శించారు. రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని దర్శించారు. సీఆర్డీఏ అమరావతి నగరంపై రూపొందించిన నమూనాలను కూడా చంద్రబాబు పరిశీలించారు. అంతేకాకుండా, టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఆలిండియా సర్వీసు అధికారుల నివాస సముదాయాలను సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మాజీ మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు.
Andhra Pradesh
Amaravathi
Chandrababu
Telugudesam
Nara Lokesh

More Telugu News