Chandrababu: చంద్రబాబు కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నాం: ఏపీ డీజీపీ సవాంగ్

  • ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం
  • చెప్పు విసిరిన వ్యక్తి తాను రైతు అని చెప్పాడు
  • రాజధాని ప్రాంతంలో వెంచర్ వేసి నష్టపోయినట్టు చెప్పారు
ఏపీ రాజధాని అమరావతి పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై చెప్పులు విసరడంతో పాటు రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందిస్తూ, దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. చెప్పు విసిరిన వ్యక్తి తాను రైతును అని చెబుతున్నాడని అన్నారు. రాజధాని ప్రాంతంలో వెంచర్ వేసి నష్టపోయామని, చంద్రబాబు వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆ ఇద్దరూ చెబుతున్నారని చెప్పారు.
Chandrababu
Telugudesam
Andhra Pradesh
DGP

More Telugu News