Nara Lokesh: మేం కూడా ఇలాగే చేసుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా?: నారా లోకేశ్

  • నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటన
  • చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు విసిరిన దుండగులు
  • రాజధానిలో ఉద్రిక్తత
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంపై ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. అమరావతి పర్యటనకు వెళుతున్న చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ అనుకూలురు చెప్పులు విసరడాన్ని లోకేశ్ తీవ్రంగా పరిగణించారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళితే వైసీపీ కుట్రలు బట్టబయలవుతాయన్న భయంతోనే ఈ విధంగా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. మరీ ఇంత పిరికితనమా? అని నిలదీశారు. టీడీపీ హయాంలో తాము కూడా ఇలాగే చేసుంటే వైఎస్ జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అంతేకాకుండా, చంద్రబాబు కాన్వాయ్ పై కొందరు చెప్పులు విసురుతున్న క్లిప్పింగ్స్ ను కూడా ట్వీట్ చేశారు.
Nara Lokesh
Jagan
Andhra Pradesh
Amaravathi
Chandrababu
YSRCP

More Telugu News