Amaravati: కూల్చివేసిన ప్రజావేదికను చూసి చంద్రబాబు భావోద్వేగం!

  • నేడు అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • రెండుగా చీలిపోయిన రాజధాని ప్రాంత రైతులు
  • బాబు పర్యటనకు వ్యతిరేకంగా ప్లెక్సీలు

ఈ ఉదయం అమరావతిలోని నిర్మాణాలను పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి బయలుదేరిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు, తొలుత కూల్చివేసిన ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆగారు. అక్కడ చుట్టూ తిరిగిన చంద్రబాబు, ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆపై ఏమీ మాట్లాడకుండానే, తన కాన్వాయ్ లో అమరావతికి బయలుదేరి వెళ్లారు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు రెండు గ్రూపులుగా విడిపోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనకు నిరసనగా నల్లజెండాలు, ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా, వాటిని దగ్గరుండి పోలీసులు కట్టించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం చంద్రబాబు వ్యతిరేక బ్యానర్లతో నిండిపోయింది. వాణిజ్య స్థలాల విషయంలో చంద్రబాబు రైతులను మోసం చేశారని, మళ్లీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని బ్యానర్లపై క్యాప్షన్లు రాశారు.

More Telugu News