Vedavati: బదిలీ అయిన టీచర్... బోరున విలపించిన విద్యార్థుల వీడియో!

  • జడ్పీ హైస్కూల్ లో తెలుగు టీచర్ గా వేదవతి
  • ఇటీవల మరో ప్రాంతానికి బదిలీ
  • వెళ్లవద్దంటూ కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు
ఆమె పేరు వేదవతి. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సీ బండపల్లె జడ్పీ హైస్కూల్ లో ఉపాధ్యాయురాలు. ఆమె బదిలీ అయితే, విద్యార్థినీ విద్యార్థినులు బోరున విలపించారు. కన్నీటి వీడ్కోలు పలికారు. తెలుగు ఉపాధ్యాయురాలైన ఆమె, సైన్స్, ఆంగ్ల సబ్జెక్టులను కూడా బోధించారు. విద్యార్థుల ప్రేమను సంపాదించుకున్నారు. అంతేకాదు, పాఠశాలను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించి, దాతల నుంచి విరాళాలు సేకరించారు.

తాజాగా ఆమె విజయపురం మండలానికి బదలీ అయ్యారు. బుధవారం నాడు ఆమె రిలీవ్ కాగా, సహచర ఉపాధ్యాయులు వీడ్కోలు పలికారు. ఇదే సమయంలో ఆమె వెళ్లిపోవడం తమకు ఇష్టం లేదని, ఇక్కడే ఉండాలని కోరుతూ విద్యార్థులు చుట్టుముట్టారు. వారి బాధను, తనపై చూపుతున్న ఆప్యాయతను తట్టుకోలేని వేదవతి కూడా కన్నీరు పెట్టుకున్నారు.
Vedavati
ZP High School
Students
Transfer

More Telugu News