Warangal Urban District: బర్త్ డే నాడు ఫ్రెండ్స్ కోసం వెళ్లి, శవమై కనిపించిన యువతి... వరంగల్ లో కలకలం!

  • నిన్న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన యువతి
  • మధ్యాహ్నానికి ఫోన్ స్విచ్చాఫ్
  • అత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకులు
తన పుట్టిన రోజు నాడు ఫ్రెండ్స్ ను కలిసి వస్తానని వెళ్లిన కుమార్తె, శవమై ఇంటికి రావడం ఆ తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేయడంతో, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వరంగల్ లో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, నగరంలో నివాసముంటున్న యువతి, బర్త్ డే నాడు స్నేహితుల వద్దకు వెళ్లి వస్తానని నిన్న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఆపై మధ్యాహ్నానికి ఫోన్ స్విచ్చాఫ్ రాగా, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అనుమానం వచ్చి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వెతికారు.

 స్థానిక హంటర్ రోడ్ లో ఆమె మృతదేహం కనిపించగా, బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ను పిలిపించి, ఆధారాలు సేకరించారు. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
Warangal Urban District
Lady
Rape
Murder

More Telugu News