Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రాంతాల్లో చిరుత సంచారం!

  • సామాజిక మాధ్యమాల్లో సంబంధిత వీడియో
  • వెళ్తున్న వాహనాలకు కొంచెం దూరంలో చిరుత  
  • అటవీశాఖాధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న ప్రయాణికుల వాహనాలకు కొంచెం దూరంలోనే చిరుత సంచరించడం ఆ వీడియోలో కనబడుతోంది. కాగా, ఈ సమాచారం మేరకు అటవీశాఖాధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం. చిరుతను బంధించేందుకు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News