SPG: ఎస్పీజీ చట్టం అసలు లక్ష్యాలను నెరవేరుస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

  • గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేశాయి
  • చట్టం అసలు ఉద్దేశాన్ని పునరుద్ధరిస్తున్నాం  
  • పీఎం, ఆయన అధికారిక నివాసంలో ఉండే కుటుంబానికే ఎస్పీజీ రక్షణ  
ఎస్పీజీ (ప్రత్యేక భద్రతా దళం) సవరణ బిల్లుపై లోక్ సభలో ఈ రోజు చర్చ జరిగింది. ఎస్పీజీ చట్టాన్ని గత ప్రభుత్వాలు నీరుగార్చాయని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టం అసలు ఉద్దేశాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. 1988లో ఈ బిల్లును తీసుకొచ్చినప్పటినుంచి ప్రభుత్వాలు చట్టాన్ని సవరిస్తూ.. దాని అసలు లక్ష్యాన్ని నిర్వీర్యం చేశాయని పేర్కొన్నారు. ఇక ముందు ప్రధానితో పాటు ఆయన అధికారిక నివాసంలో ఉండే కుటుంబానికి మాత్రమే ఎస్పీజీ రక్షణ కల్పించబడుతుందని అన్నారు.

అదేవిధంగా మాజీ ప్రధానితోపాటు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే వారి కుటుంబ సభ్యులకు ఐదేళ్ల కాలంపాటు ఎస్పీజీ భద్రతను కల్పిస్తామని తెలిపారు. గాంధీ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలకు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్పీజీ భద్రతను ఇటీవల కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చట్ట సవరణకుద్దేశించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.
SPG
Lok Sabha
SPG Amendment bill
Home Minister Amit Sha
Comments

More Telugu News