Telugudesam: జైలులో ఉన్న వెంకట సుబ్బారెడ్డిని పరామర్శించిన చంద్రబాబు

  • చిన్నకేసుకే సుబ్బారెడ్డిని జైలులో పెట్టారని బాబు విమర్శ
  • టీడీపీ నేతలపై కక్ష సాధింపుకు దిగుతోందని ఆరోపణ
  • వివేకా హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని డిమాండ్
కడప జైల్లో ఉన్న తమ పార్టీ నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజు కలిసి పరామర్శించారు. చంద్రబాబు కడప జిల్లా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలో పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ కార్యకర్తలకు మార్గ నిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చిన్న కేసుకే వెంకట సుబ్బారెడ్డిని జైలులో పెట్టారన్నారు. టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. మరోవైపు పోలీసులు కూడా అతిగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకోవడంలో వారు శ్రద్ధ చూపాలని చెప్పారు.
Telugudesam
Chandrababu
visit
Kadpa
meet Redyam venkata Subbareddy at Jail

More Telugu News