కృష్ణా జిల్లాలో హెచ్పీసీఎల్ పైప్ లైన్ నుంచి లీకయిన పెట్రోలు

27-11-2019 Wed 14:41
  • 20వేల లీటర్ల పెట్రోలు రోడ్డు పాలు
  • అప్రమత్తమైన ఉన్నతాధికారులు, సిబ్బంది
  • ట్రాఫిక్ మళ్లించి రక్షణ చర్యలు చేపట్టిన పోలీసులు
కృష్ణాజిల్లాలో హెచ్పీసీఎల్ పైప్ లైన్ నుంచి పెట్రోలు లీకైంది.  సుమారు 20వేల లీటర్ల పెట్రోలు రోడ్డు పాలైంది. మరమ్మతులకు గురైన పైప్ లైన్ నుంచి పెట్రోలు లీకవుతున్న విషయాన్ని ఈ రోజు తెల్లవారు జామున స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. పెనుగంచిప్రోలు మండలంలోని ముండ్లపాడు గ్రామ సమీపంనుంచి వెళుతున్న పైప్ లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ముందు జాగ్రత్తగా పెనుగంచిప్రోలు రోడ్డులో ట్రాఫిక్ ను దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న హెచ్ పీసీఎల్ ఉన్నతాధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని, లీకవుతున్న పైప్ లైన్ కు మరమ్మతులు ప్రారంభించారు. అగ్నిమాపక శకటాలతో పాటు పలువురు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు చెలరేగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు.