Bhagya Raj: మహిళలపై భాగ్యరాజ్ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందన

  • మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్న భాగ్యరాజ్
  • సినీ పెద్దలు ఇలా చెప్పడం బాధాకరమన్న చిన్మయి
  • ఇలాంటి వ్యాఖ్యల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారంటూ ఆగ్రహం
వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను కూడా మహిళలు చంపేస్తున్నారని సినీ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అత్యాచారాలు జరగడానికి మహిళలే కారణమని ఆయన అన్నారు. ఒకప్పుడు కట్టుబాట్లతో ఉండే మహిళలు... సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్లు అదుపుతప్పుతున్నారని చెప్పారు. భాగ్యరాజ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే అంశంపై సినీ గాయకురాలు చిన్మయి శ్రీపాద స్పందించారు. మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని సినీ పరిశ్రమ పెద్దలు చెప్పడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారని మండిపడ్డారు.
Bhagya Raj
Chinmayi
Tollywood

More Telugu News