Jagan: ముఖ్యమంత్రి గారూ.. ఇది మీకో పెద్ద అగ్ని పరీక్ష: టీడీపీ నేత వర్ల రామయ్య

  • మీ సహచర మంత్రులు బూతు పదాలు వాడుతున్నారు
  • శాసనసభలో సమన్యాయం పాటించవలసిన పెద్ద మనిషి కూడా ఇంతే
  • ఈ విషయం రాష్ట్ర మహిళాలోకానికి కూడా తెలిసిపోయింది

ఆంధ్రప్రదేశ్ మంత్రులందరూ పరుష పదజాలం వాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. వారి తీరుపై  ముఖ్యమంత్రి జగన్ ఏ చర్యలు తీసుకుంటారని రాష్ట్రం అంతా ఎదురు చూస్తోందని ట్వీట్ చేశారు.
 
'ముఖ్యమంత్రి గారు! మీకో పెద్ద అగ్ని పరీక్ష. మీ సహచర మంత్రులు, శాసనసభలో సమన్యాయం పాటించవలసిన పెద్ద మనిషితో సహా అందరూ బూతు శాస్త్ర కోవిదులే. ఈ విషయం రాష్ట్ర మహిళాలోకానికి కూడా తెలిసిపోయింది. దుమ్మెత్తి పోస్తున్నారు. ఏమి చర్యలు తీసుకుంటారు అని రాష్ట్రం అంతా ఎదురు చూస్తోంది. కింకర్తవ్యం?' అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

More Telugu News