Vijay Devarakonda: కొత్త ఇంట్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఫొటో

  • ఇటీవల ఇల్లు కొన్న విజయ్
  • రూ. 15 కోట్లతో ఫిల్మ్ నగర్ లో ఇల్లు
  • కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తాను ముచ్చటపడి కొనుక్కున్న కొత్త ఇంట్లోకి మారిపోయాడు. తన ఫ్యామిలీ గృహ ప్రవేశం చేసిందని చెబుతూ, సంప్రదాయ వస్త్రధారణలో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఇంటి బయట కూర్చున్న ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్, ఇటీవల ఫిల్మ్ నగర్ దగ్గరలో రూ. 15 కోట్లు వెచ్చించి ఇంటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఆ ఇంటికి తనకు నచ్చినట్టుగా మార్పులు చేయించిన విజయ్, ఆ ఇంట్లోకి మారిపోయాడు. విజయ్ దేవరకొండ కొన్న రెండో ఇల్లు ఇది కావడం గమనార్హం. త్వరలో ఆయన నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, చేతిలో మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక నూతన గృహంలోకి ప్రవేశించిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి ఫ్యాన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలియజేశారు.

Vijay Devarakonda
Instagram
House Warming
Family

More Telugu News