Maharashtra: అజిత్ పవార్ ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికిన సుప్రియా సూలే... ఫడ్నవీస్ కు పలకరింపు!

  • ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
  • ఎమ్మెల్యేలను పలకరించిన సుప్రియా సూలే
  • సభ్యులతో ప్రమాణం చేయిస్తున్న ప్రొటెమ్ స్పీకర్
ఈ ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. సభ ప్రారంభానికి చాలా సమయం ముందే అసెంబ్లీకి చేరుకున్న ఎన్సీపీ నేత సుప్రియా సూలే, పలువురికి ఆత్మీయ స్వాగతం పలికారు. బీజేపీతో కలిసేందుకు సిద్ధమై, ఆపై మనసు మార్చుకున్న అజిత్ పవార్, అసెంబ్లీకి వచ్చిన వేళ, ఆయన్ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు సుప్రియ.

అలాగే, శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే వద్దకు వెళ్లి పలకరించారు. ఇంకా పలువురిని పేరుపేరునా పలకరించారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో మర్యాద పూర్వకంగా కరచాలనం చేసిన ఆమె, ఎమ్మెల్యేలతో కలిసి కలివిడిగా తిరుగుతూ  కనిపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, సంకీర్ణ ప్రభుత్వంపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటామన్న నమ్మకం ఉందని అన్నారు. కాగా, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్ గా నిన్న బాధ్యతలు స్వీకరించిన  కాళిదాస్ కొలంబ్కార్, ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.
Maharashtra
Assembly
Supriya Sule
Fadnavees
Ajit Pawar

More Telugu News