Jana Sena: పవన్ కల్యాణ్ తో మండలి బుద్ధప్రసాద్, జొన్నవిత్తుల, ముక్తేశ్వర రావు భేటీ

  • తెలుగు భాషలో బోధన-పాలనపై చర్చ
  • ‘తెలుగు’ పరిరక్షణకు ముందుకొచ్చిన పవన్ ని అభినందిస్తున్నా
  • మాతృ భాషలో ప్రాథమిక విద్య అందాలి

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు భాషలో బోధన, పాలన సాగాలనే అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు భేటీ అయ్యారు.  
 
తెలుగు భాష పరిరక్షణకు ముందుకొచ్చిన పవన్ ని అభినందిస్తున్నానని, ఈ అంశంపై తన ఆలోచనలు పంచుకున్నానని ముక్తేశ్వరరావు అన్నారు. మాతృ భాషలో ప్రాథమిక విద్య అందాలని, దానికి అనుగుణంగానే ఆర్టికల్ 21ఏ, రైట్ టూ ఎడ్యుకేషన్ చట్టం తీసుకురావడం జరిగిందని, పిల్లలకు పాఠ్యాంశాలు అర్థం కావాలన్నా, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య అంతరాలు రాకుండా ఉండాలన్నా మాతృభాషలోనే బోధన జరగాలని అన్నారు.

భారత రాజ్యాంగం ఆమోదించి 70 ఏళ్లయిందని, ఒక సామాన్య పౌరుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తన మాతృభాషలో సమాచారాన్ని అడిగే హక్కు, తన సమస్యను మాతృ భాషలోనే తెలిపే హక్కు ఉందని చెప్పారు. అటు పాలనలో ఇటు బోధనలో మాతృ భాష వినియోగానికి ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చన్న విషయమై పవన్ కల్యాణ్ తో చర్చించామని చెప్పారు.

More Telugu News