Maruti Alto: అమ్మకాల్లో ఎదురులేని మారుతి ఆల్టో!

  • ఇప్పటివరకు 38 లక్షల అమ్మకాలు
  • 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన చిన్నకారు
  • దశాబ్దకాలం పైగా మార్కెట్లో ఆధిపత్యం

చిన్నకారు సెగ్మెంట్లో తానే కింగ్ అని మారుతి ఆల్టో మరోసారి నిరూపించుకుంది. దశాబ్దకాలం పైగా  తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ఆల్టో ఈ ఏడాది కూడా అమ్మకాల్లో ఇతర పోటీదార్లను వెనక్కినెట్టింది. ఇప్పటివరకు తాము 38 లక్షల ఆల్టో కార్లను విక్రయించినట్టు మారుతి వర్గాలు వెల్లడించాయి. 2000 సంవత్సరంలో మార్కెట్లో ప్రవేశించిన ఈ ఎంట్రీ లెవల్ కారుకు మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల వినియోగదారుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

చూడచక్కని రూపం, అందుబాటు ధర, అధిక మైలేజి వంటి అంశాలు ఆల్టో అమ్మకాల్లో పురోగతికి దోహదపడుతున్నాయని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా మారుతున్న మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మారుతి సంస్థ ఆల్టో బీఎస్-6 వెర్షన్ కూడా తీసుకువచ్చింది.

More Telugu News