Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం..ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా

  • బలపరీక్షకు ముందే అజిత్ పవార్ రాజీనామా
  • కుటుంబ సభ్యులతో కలిసి అజిత్ పై ఒత్తిడి తెచ్చిన ఎన్సీప్ చీఫ్ శరద్ పవార్
  • ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తారని ఊహాగానాలు?

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే చేతులెత్తేశారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపి ఉపముఖ్యమంత్రి పదవిని పొందారు.

దీంతో ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ భగ్గుమన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అజిత్ పై ఒత్తిడి తేవడంలో విజయం సాధించారు. తాజాగా అజిత్ ను మళ్లీ పార్టీలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అజిత్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దుచేయలేదని శరద్ పవార్ ప్రకటించారు. నిన్న, కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ఉమ్మడిగా తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ మీడియా ఎదుట పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గవర్నర్ ఎదుట బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా రాజీనామా చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.

More Telugu News