Jagan: ఆ మేధావులను మళ్లీ స్మరించుకుందాం: సీఎం జగన్

  • రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 70 ఏళ్లు
  • ట్విట్టర్ లో స్పందించిన సీఎం జగన్
  • ప్రతిజ్ఞ చేద్దామని పిలుపు
భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. 1949 నవంబరు 26న భారత రాజ్యాంగం రాజ్యసభలో ఆమోదం పొందింది. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, సుదృఢమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలోని మేధావులను మరోసారి స్మరించుకుందాం అని ట్వీట్ చేశారు. 70 ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరని రీతిలో ప్రగాఢమైన సైద్ధాంతిక బలం ఉన్న రాజ్యాంగాన్ని ప్రసాదించారని కొనియాడారు. రాజ్యాంగ సిద్ధాంతాలకు, స్ఫూర్తికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేద్దామని, సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం అందించే రాష్ట్ర నిర్మాణానికి కృషి చేద్దామని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
Jagan
Ambedkar
Constitution
India
Andhra Pradesh
YSRCP

More Telugu News