nitin gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి పలు అంశాలపై చర్చించాం: కేశినేని నాని

  • విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ రెండో భాగం నిర్మాణంపై చర్చ
  • విజయవాడ బైపాస్ రోడ్డు అభివృద్ధి చేయాలని వినతి
  • రాజధానికి అనుసంధానించే రోడ్ల అభివృద్ధి వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి
టీడీపీ ఎంపీలు ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలు అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. గడ్కరీతో చర్చిస్తుండగా తీసిన ఫొటోలను పోస్ట్ చేశారు.  
       
'కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి.. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ రెండో భాగం నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరాము. అలాగే విజయవాడ బైపాస్ రోడ్డు అభివృద్ధి, రాజధానికి అనుసంధానించే రోడ్ల అభివృద్ధి వెంటనే చేపట్టాలని కోరాము' అని కేశినేని నాని తెలిపారు. గడ్కరీతో చర్చించిన నేతల్లో ఎంపీ కేశినేని నానితో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు,  కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి కూడా ఉన్నారు.
nitin gadkari
Kesineni Nani
galla jaydev

More Telugu News