Sonia Gandhi: బలపరీక్షలో విపక్షాలదే విజయమన్న సోనియా గాంధీ.. తమ నేతలతో శరద్ పవార్ భేటీ

  • సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న సోనియా
  • ఈ తీర్పు చారిత్రాత్మకమని వ్యాఖ్య
  • ఇది ప్రజాస్వామ్య విజయమన్న శివసేన

మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ తీర్పు చారిత్రాత్మకమని, బలపరీక్షలో విపక్షాలదే విజయమని అన్నారు. దీనిపై శివసేన నేతలు స్పందిస్తూ ఈ తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు.

'ఖేల్‌ ఖతం' అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్‌ మాలిక్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఎన్సీపీ నేతలతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ సమావేశమయ్యారు. రేపటి బలపరీక్షపై చర్చిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ కలిశారు. బలపరీక్ష నేపథ్యంలో వ్యూహాలపై చర్చిస్తున్నారు. తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.

More Telugu News