Rajani: గౌతమ్ మీనన్ కి ఓకే చెప్పిన రజనీకాంత్

  • రజనీ తాజా చిత్రంగా రానున్న 'దర్బార్'
  • దర్శకుడు శివతో సినిమాకి సన్నాహాలు 
  • రజనీ 169వ సినిమా దర్శకుడిగా గౌతమ్ మీనన్
రజనీకాంత్ తాజా చిత్రంగా రూపొందిన 'దర్బార్' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత రజనీకాంత్, దర్శకుడు శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

ఆ తరువాత ప్రాజెక్టును కూడా రజనీ సెట్ చేసుకున్నారనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. గౌతమ్ మీనన్ చెప్పిన కథ నచ్చడంతో రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అంటున్నారు. గౌతమ్ మీనన్ టేకింగ్ స్టైల్ నచ్చడం వల్లనే రజనీ ఛాన్స్ ఇచ్చారని చెబుతున్నారు. కెరియర్ పరంగా రజనీకి ఇది 169వ సినిమా. వేల్స్ ఫిల్మ్  ఇంటర్నేషనల్ సంస్థవారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం.
Rajani
Gautham Menon

More Telugu News